సంక్రాంతి పండగ వచ్చిందంటే రైతుకు ఇంట్లో ధాన్యరాసులు. ప్రేక్షకులకు కంటినిండా పసందైన విందు మన సినిమాలు. చిత్రసీమలోని తారలు, నిర్మాతలు అందరూ సంక్రాంతి పండగక్కి తమ సినిమా ప్రేక్షకుల్ని మురిపించాలని కోరుకుంటారు. అలాగే ప్రతి ప్రేక్షకుడిని పలకరించాలని తపిస్తుంటారు. ప్రతి తెలుగులోగిలో సం‘క్రాంతి’ నింపాలని కోరకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.