‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ వచ్చేది ఆ రోజే
మహేష్‌ బాబుతో తుపాకి పట్టుకుని నడుస్తూ వచ్చే సన్నివేశాన్ని చూపించి అందరిలో ఆసక్తి పెంచాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. మహేష్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. టీజర్‌ లోడింగ్‌ అంటూ ఓ హ్యాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది చిత్ర బృందం. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ టీజర్‌ అని ఎదురు చూస్తున్నారు సినీ ప్రియులు. తాజాగా ఆ తేదీని ఖరారు చేశారు. నవంబరు 22న సాయంత్రం 5:04 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రష్మిక కథానాయకగా నటిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.