సర్‌ప్రైజ్‌ అదిరింది..

మహేష్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కనున్న కొత్త చిత్రం నుంచి అదిరిపోయే కానుక అందింది. నేడు తన తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకోని ఈ చిత్ర టైటిల్‌ను విడుదల చేశారు మహేష్‌. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రానికి ‘సర్కారు వారి పాట’ అనే ఆసక్తికర పేరును ఖరారు చేసింది చిత్ర బృందం. ‘గీతగోవిందం’ వంటి హిట్ తర్వాత పరశురామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో స్టైలిష్‌ హెయిర్‌ స్టైల్‌తో చెవి పోగు మెడపై రూపాయి టాటూతో ఆకట్టుకునేలా దర్శనమిచ్చారు. టైటిల్‌ పోస్టర్‌ను బట్టీ చూస్తుంటే బ్యాంకు రుణాల కుంభకోణం చుట్టూ అలుకున్న కథగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీస్‌, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. సినిమాలోని ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..

‘సర్కారు వారి పాట’ విడుదలపై మహేష్‌ క్లారిటీ

బుర్రిపాలెం బుల్లోడు.. అద్భుతాల అసాధ్యుడు

రానా పెళ్లి ముహూర్తం అప్పుడే..

మే 31.. (సినీ చరిత్రలో ఈరోజు)

సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.