యువ కథానాయకుడు సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం ‘తిమ్మరుసు’. అసైన్మెంట్ వాలి ఉపశీర్షిక. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా స్యతదేవ్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. క్లాసిక్ లుక్‌లో దర్శనమిచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు సత్య. ఓ చేత్తో సూట్‌కేస్ పట్టుకుని బైక్‌పై కూర్చున్న ఈ పోస్టర్ ఆసక్తి రేకెత్తిస్తోంది. లాంగ్ హెయిర్‌తో కళ్లద్దాలతో స్టైలిష్‌గా కనిపిస్తూనే సీరియస్‌గా కనిపిస్తున్నాడు. అక్కడ ఏం జరిగింది? ఎందుకలా ఉన్నాడు అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాలో సత్యదేవ్ సరసన ప్రియాంక జవాల్కర్ నటిస్తుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. టీజర్‌ని డిసెంబరు 9న విడుదల చేయబోతున్నారు.
