డ్యాన్స్ తో అదరగొడుతున్న అఖిల్‌ కథానాయిక

వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించిన అఖిల్ చిత్రంలో కథానాయికగా నటించి మెప్పించిన చిన్నది సాయేషా సైగల్‌. అఖిల్ సరసన దియాగా అలరించిన ఈ అమ్మడు డ్యాన్స్ తో అదరగొడుతోంది. కరోనా వైరస్‌ కారణంగా కేంద్రరాష్ర్ట ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో సామాన్యుల నుంచి సెలబ్రీటీల వరకు అంతా ఇంట్లోనే ఉండిపోయారు. తాజాగా సాయేషా ప్రముఖ ఫ్రెంచ్‌ డీజే స్నేక్‌ ఆల్బంలోని టాకీ టాకీ అంటూ సాగే హాట్‌ సాంగ్‌కి డ్యాన్స్ చేస్తూ నడుమును వయ్యారంగా తిప్పుతూ కవ్విస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోను సాయేషా తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ వీడియోకు డ్యాన్సింగ్‌ ది లాక్‌డౌన్ బ్లూస్‌ అంటూ ట్యాగ్‌లైన్‌ తగిలించింది. గత ఏడాది తమిళనటుడు సూర్యతో కలిసి కప్పాన్‌ (తెలుగులో బందోబస్త్) చిత్రంలో నటించింది. ప్రస్తుతం సాయేషా తన భర్త ఆర్యతో కలిసి టెడ్డీ చిత్రంలో నటిస్తోంది. కరోనా కారణంగా చిత్రం వాయిదా పడింది. కొంతమంది నాయికలైతే తమకు ఇష్టమైన వంటకాలు, యోగాసానాలు, జిమ్ చేస్తూ సందడి చేశారు. మరికొంత మంది అయితే ఆన్‌లైన్‌ చదువుకుంటూ కథక్‌, భరత్‌నాట్యం సంగీతం కూడా నేర్చుకుంటున్నారు. ఆయేషా మాత్రం ఇలా వారికి భిన్నంగా   డ్యాన్స్ చేస్తూ అలరిస్తోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.