శర్వా.. పవన్‌ని ఎందుకు కలిశాడు?

ద్దరు కథానాయకులు ఒకే ఫోటోలో కనిపిస్తే అది అభిమానులకు ఆనందమే అయినా ఎందుకు కలిశారో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంతకీ వీరిద్దరూ ఎందుకు కలిశారంటే.. ప్రేక్షకులతోపాటు సినీ తారలూ పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌ అంటే అభిమానం చూపిస్తుంటారు. తాజాగా యంగ్‌ హీరో శర్వానంద్‌ అదే అభిమానంతో ఓ సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు. తాను నటిస్తున్న ‘రణరంగం’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శర్వా కాకినాడ పయనమయ్యాడు. మరోవైపు పవన్‌ తన కార్యాచరణ మేరకు భీమవరం వెళ్లి తిరుగు ప్రయాణంలో రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్నారు. అదే సమయంలో శర్వా పవన్‌ని కలిశాడు. విమానాయశ్రయం షటిల్‌ బస్సులో ఉన్న పవన్‌తో సెల్ఫీ తీసుకుని దాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘అనుకోకుండా పవర్‌ స్టార్‌ని కలిశాన’ని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

View this post on Instagram

Enroute Kakinada for #RanarangamTrailer launch and luckily met The Man, our Power Starrr 💥

A post shared by Sharwanand (@imsharwanand) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.