వైరల్‌ అవుతోన్న ‘చిరు 152’ లుక్‌
చిరంజీవి కథానాయకుడుగా కొరటాల శివ ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘చిరు 152’ వర్కింగ్‌ టైటిల్‌తో ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్‌లో పాల్గొన్న చిరు లుక్‌ ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. లీక్ అయిన ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇందులో చిరు రఫ్‌ లుక్‌లో ఎర్రని కండువా ధరించి దర్శనమిచ్చాడు. దీన్ని చూసిన అభిమానులు గత చిత్రాల్లోని చిరు లుక్‌ను పోలుస్తూ ట్వీట్‌ చేస్తున్నారు. మరి ఈ విషయంలో చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరు దేవాదాయశాఖ ఉద్యోగిగా కనిపించనున్నారు. త్రిష నాయిక. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.