30 ఏళ్ల ‘శివ’ని గుర్తు చేస్తోన్న ఆర్జీవీ

రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘శివ’ అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగార్జున కథానాయకుడుగా రూపొందించిన ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు అయింది. ఇన్నేళ్ల తర్వాత దర్శకుడు ఆర్జీవీ ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఓ ఫొటో ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో నాగార్జున, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ సీరియల్‌ లుక్‌లో కనిపిస్తారు. ‘‘శివ సినిమా చిత్రీకరణలో నాగార్జున, ఇస్మార్ట్‌ పూరి జగన్నాథ్‌’’ అంటూ ఈ ఫొటోకు వ్యాఖ్యను జోడించాడు. ‘పూరి గారు అప్పుడు తన కుమారుడు ఆకాశ్‌ ఉన్నట్లుగానే ఉన్నారు. నాగ్‌ సర్‌ ఎవర్‌గ్రీన్‌’ అంటూ అభిమానులు కామెంట్స్‌ పెడుతున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.