
మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు అయిన రియా చక్రవర్తి సోదరుడు షోయిక్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై అక్రమ మాదకద్రవ్యాల కేసులో నేపథ్యంలో రియా చక్రవర్తి సోదరుడిని ఎన్సీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు నెలలు జైలులో ఉన్న అతనికి ఇప్పుడు పత్ర్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాదకద్రవ్యాల పెడ్లర్లతో సంబంధంతో అతను దివంగత నటుడు సుశాంత్‌కి డ్రగ్స్ ని పంపిణీ చేసేవాడు. సుశాంత్ సింగ్ మరణంలో డ్రగ్స్ కోణంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో షోయిక్‌ను అరెస్టు చేసింది. ఇప్పటి వరకు షోయిక్ రాయ్‌గఢ్‌లోని తలోజా సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. ఇప్పటికే రియా చక్రవర్తికి అక్టోబర్ 7న బొంబాయి హైకోర్టు షరత్‌లతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.