గోవాలో సందడి చేస్తున్న శ్రుతి

ఈ మధ్య కాలంలో శ్రుతి హాసన్‌ ఎక్కడా సందడి చేసినట్లు కనిపించిలేదు. అయితే ఇప్పుడు గోవా తీరంలో తనకు ఇష్టమైన వారి మధ్య హాయిగా ఎంజాయ్‌ చేస్తుంది శ్రుతి హాసన్‌. తెలుగులో ‘కాటమరాయుడు’ తరువాత తెలుగులో మరే చిత్రంలోనూ నటించలేదు. కొన్నాళ్ల కిందట ప్రియుడు మైఖేల్‌ కోర్స్‌లేతో అప్పుడప్పుడు విమానశ్రయాల్లోను, లేదా విదేశాల్లో చక్కర్లు కనిపించేది. కానీ గోవా బీచ్‌లో ప్రియుడు లేకుండానే తన ఇష్టమైన స్నేహితుల మధ్య హాయిగా కనిపించింది. ఇదే విషయాన్ని శ్రుతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో...‘‘ఈ మధ్య కాలంలో నేను బాగా సంతోషంగా గడిపిన హాలీడే ఏదైనా ఉందంటే! అది ఇదే. కొంతమంది స్నేహితుల మధ్య గడిపితే..చాలు మనకు నమ్మకము, తిరిగి మనకు అపారమైన భరోసా లభిస్తుందంటూ’’ పోస్ట్‌ చేసింది. 2017లో హిందీ చిత్రం ‘బెహన్‌ హోగి తేరి’ చిత్రం 2018లో తెరపై కనిపించలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.



View this post on Instagram

A post shared by @shrutzhaasan on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.