ఏమిటీ ఈ జీవితం: శ్రుతిహాసన్‌

కరోనా వైరస్‌తో కొంతమందికి కావాల్సినంత సమయం దొరికింది. మరికొందరికి జీవితమే ఆగమ్యగోచరంగా తయారైంది. అయితే సినిమా పరిశ్రమకు చెందిన నాయికానాయకులకు మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడానికి ఎంతో ఉపయోగపడిందని చెప్పవచ్చు. అయితే తాజాగా కమల్‌హాసన్‌ కూతురు శ్రుతిహాసన్‌ మాత్రం లాక్‌డౌన్‌లో ఒంటిరి జీవితం గురించి ఓ వైవిధ్యమైన వీడియోను విడుదల చేసింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..‘బద్దకంగా నిద్ర లేవడం, తన జుట్ట వాసన పదేపదే చూసుకోవడం. ఆ తరువాత తేరాగా ఫోటో షూట్‌ల్లో పాల్గొంది. ఆ వీడియోకి తనదైన రీతిలో కామెంట్‌ కూడా’ చేసింది. ‘‘లాక్‌డౌన్‌లో ఏ ఒక్క జీవితం 100 రోజుల గడిచిన తరువాత ఇలాగే కనిపిస్తోందని..’’ పేర్కొంది. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌తో కలిసి ‘వకీల్‌ సాబ్‌’ చిత్రంలో భార్యగా కనిపించనుంది. రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్‌’ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయిగా నటిస్తోంది. బాలీవుడ్‌లో విడుదలైన ‘యారా’లో చిత్రంలో కథానాయికగా అలరించింది. విద్యుత్‌ జమ్మాల్‌, విజయ్‌వర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తిగ్మన్షు దులియా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం ఫ్రెంచ్‌ చిత్రం ‘ఎ గ్యాంగ్‌ స్టోరీ’కి రీమేక్‌గా తెరకెక్కింది. నలుగురు స్నేహితుల కథగా నేపాల్‌ - ఇండియా సరిహద్దు ప్రాంతాల్లో నడిచే ఈ సినిమా జులై 30, 2020న ఓటీటీలో విడుదలైంది.

View this post on Instagram

A post shared by @shrutzhaasan on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.