మంచి కథలు.. నాతో పంచుకోండి

‘మీలోని సృజనాత్మకతను వెలికితీయడానికి ఇది మంచి తరుణం. మంచి కథ రాసి, నాతో పంచుకోండి’ అంటోంది శోభిత ధూళిపాళ్ల. బాలీవుడ్‌లో ‘రామ్‌ రాఘవ’, ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ వంటి చిత్రాల్లోనూ, ‘మేడిన్‌ హెవన్‌’ వంటి వెబ్‌సిరీస్‌ల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించిందీ ముద్దుగుమ్మ. అడవిశేషు నటించిన ‘గూఢచారి’ చిత్రంలో కథానాయికగా చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైందీ భామ. ‘ఈ లాక్‌డౌన్‌ నాలోని కొన్ని భారాలను దించింది. మన దేశంలో ప్రతిభకు కొదవ లేదని నేను తెలుసుకున్నా. దీన్ని ఒక చోటికి తేవడానికి వేదిక కావాలి. ప్రస్తుతానికి ఈ వేదికకు పేరుపెట్ట లేదు. ‘క్రియేటివ్‌ స్టూడియో’ అనుకోండి. సినిమాకు ఉపయోగపడే మంచి కథలు ఉంటే చెప్పండి’ అంటూ సామాజిక మాధ్యమాల్లో చెప్పుకొచ్చింది. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.