ఈ యేడాది బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్లో చిక్కుకున్న ఎంతో మంది వలస కార్మికులను ఆదికున్నారు. ఆ సయమంలో పేదలకు, వలస కార్మికుల కోసం ఎంతో చేశాడు. దాని ఫలితమే ఇప్పుడు ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. తాజాగా సోనూ సూద్‌ని కలవడానికి బీహార్‌కి చెందిన ఆర్మాన్ అనే అభిమాని సైకిల్ మీద బేగుసారై నుంచి ముంబై వరకు వస్తున్నాడు. మధ్యలో బీహార్‌లోని ఓ న్యూస్ఛానల్లో ఆర్మాన్ మాట్లాడుతూ..లక్షలాది మంది వలస కార్మికుల కోసం ఆయన ఎంతో సహాయం చేశాడు. నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్పి కౌగిలించుకోవాలని అనుకుంటున్నాని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న సోనూ అతన్ని సైకిల్‌పై ఇంత దూరం రావొద్దు. నేనే అతన్ని విమానంలో వారణాసి నుంచి ముంబైకి తీసుకువస్తాను. అంతేకాదు అతని సైకిల్‌తో సహా విమానంలోనే తిరిగు ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను అంటూ చెప్పారు. సోనూ ఈ సందర్భంగా మాట్లాడుతూ..నేను సహాయం చేసిన దాని కంటే వారి నుంచి పొందే ప్రేమ ఎంతో గొప్పది. నేను ఇచ్చిన దాని కంటే ఎక్కువ ప్రేమను పొందుతున్నాను. ఇలాంటి ప్రేమను ఎవరు పొందుతారు? అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడట. ప్రస్తుతం సోనూ సూద్ చిరంజీవితో కలిసి ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు.