సారీ రకుల్‌.. సారీ సారా

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే డ్రగ్స్‌ వినియోగం కూడా బయటకు వచ్చింది. దర్యాప్తు చేపట్టిన నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, సామ్యూల్‌ మెరిండాతోపాటు మరికొంతమందిని అరెస్ట్‌ చేసి, విచారణ చేస్తోంది. రియా.. సుశాంత్‌ కోసం మత్తు పదార్థాలు తెప్పించేదాన్నని ఒప్పుకుంది. అంతేకాకుండా రియా 20 పేజీల స్టేట్‌మెంట్‌ను ఎన్‌సీబీకి అందించారని, అందులో డ్రగ్స్‌ తీసుకుంటున్న 25మంది సెలబ్రిటీల పేర్లను వెల్లడించారని ప్రచారం సాగింది. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్, సారా అలీఖాన్‌ పేర్లు కూడా ఉన్నాయని వార్తలొచ్చిన విషయం విధితమే. వారిద్దపై సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్లు చేశారు నెటిజన్లు. తాజాగా రకుల్, సారా డ్రగ్స్‌ తీసుకున్న సెలబ్రిటీ జాబితాలో లేరని ఎన్‌సీబీ పేర్కొంది. దాంతో ‘సారీ రకుల్‌’, ‘సారీ సారా’ అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ప్రముఖ నాయిక సమంత కూడా తన ఇన్‌స్టా ఖాతాలో అందరి తరఫున క్షమాపణలు చెప్పారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.