సౌందర్య పెళ్లివిందులో మెరిసిన కాజోల్‌

ప్రముఖ నటుడు రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య వివాహం విశాకన్‌ వనగమూడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు చాలా మంది అతిథులు వచ్చారు. వారందరిలో బాలీవుడ్‌ నుంచి వచ్చిన నటి కాజోల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాజోల్‌కు రజనీకాంత్‌ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంది. రజనీ అల్లుడు ధనుష్‌తో కలిసి ‘విఐపి2’లో తెరపంచుకుంది. కాజల్‌ ఎర్రని చీరలో సందడి చేసింది. పెళ్లికూతురు సౌందర్యతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెట్టింది. దానికి ‘‘విషింగ్‌ మై స్వీట్‌ డైరక్టర్‌ ఎ వండర్‌ఫుల్‌ లైఫ్‌’’ ట్యాగ్‌ లైన్‌ కూడా తగిలించింది. తెలుగు చిత్రసీమ ఎందరో ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. రజనీకాంత్‌ ప్రాణ స్నేహితుడు మోహన్‌బాబు కూమార్తె మంచు లక్ష్మి ప్రసన్న కూడా హాజరైంది. మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో సౌందర్యతో కలిసి దిగిన ఫోటోను పెట్టి..‘‘ఏ లైఫ్‌ టైమ్‌ ఆఫ్‌ బ్లెస్‌ మై డార్లింగ్‌..’’ అంటూ శుభాకాంక్షలు తెలిపింది.


View this post on Instagram

A post shared by Kajol Devgan (@kajol) on

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) onCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.