గాయకుడు ఎస్పీ బాలుకి కరోనా పాజిటివ్‌


లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోవిడ్‌-19 లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఓ వీడియో ద్వారా వెల్లడించారు. గాయకుడు బాలసుబ్రహ్మణ్యం కోవిడ్ -19 స్వల్ప లక్షణాలతో’ కరోనా పాజిటివ్‌గా రాగా డాక్టర్లు పరీక్షించి ఇంట్లోనే 15 రోజుల పాటు స్వీయ నిర్భంధంలో ఉండాలని సూచనలు చేశారట. వీడియో సందేశంలో ఎస్పీ బాలు మాట్లాడుతూ “గత రెండు రోజుల నుండి, ఛాతీ రద్దీ, కఫం ఏర్పడటం, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో నేను కొంచెం అసౌకర్యానికి గురవుతున్నాను. తేలికగా తీసుకోకుండా, నేను ఆసుపత్రికి వెళ్లి నన్ను పూర్తిగా తనిఖీ చేసుకున్నాను. చివరికి, నేను కోవిడ్‌ -19 చాలా తేలికపాటి లక్షణాలతో’ పాజిటివ్‌గా పరీక్షించబడ్డాను నన్ను వైద్యులు 15 రోజుల పాటు స్వీయ-నిర్బంధంలో ఉండాలని సలహా ఇచ్చారు. నేను ఎటువంటి రిస్క్ తీసుకోవటానికి, నా కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించడానికి ఇష్టంలేదు. కనుక నేను ఆసుపత్రిలో చేరాను. నా డాక్టర్ స్నేహితులు, ఆసుపత్రి సిబ్బంది అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు. త్వరలోనే కోలుకొని బయటకు వస్తానని నమ్మకంగా ఉన్నాను. అభిమానులు, స్నేహితులు, నన్ను ప్రేమించే అందరూ బాధపడవద్దని, మీరంతా నిశ్చితంగా ఉండాలి..’’అంటూ పేర్కొన్నారు. బాలు ప్రస్తుతం విశ్రాంతి తీసుకొని రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఐదు దశాబ్దాలుగా చిత్రసీమలో కొనసాగుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడతో సహా 15 భాషల్లో అసంఖ్యాక పాటలను పాడారు. ఎప్సీ బాలు ప్లేబ్యాక్ గాయకుడిగా నలభై వేలకు పాటలకు పైగా పాడారు. నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. భారతప్రభుత్వం నుంచి ఆయన పద్మశ్రీ, పద్మభూషణ్‌లాంటి అవార్డులు పొందారు.

                                                         


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.