వెండి తెరపై జానపదానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సందర్భం కుదరాలే కానీ ఫోక్ సాంగ్‌ని ఎవరు మాత్రం వద్దంటారు. అటు మాస్ ప్రేక్షకుల్ని, ఇటు క్లాస్ వర్గాన్ని ఆకట్టుకునే గీతాల్లో ఇదొకటి. ఇప్పటికే తెలుగు చిత్రాల్లో వచ్చిన ఎన్నో జానపదాలు ఓ ఊపు ఊపాయి. తాజాగా ఈ జాబితాలో నిలిచేందుకు రాబోతుంది ‘భలేగుంది బాలా’. ప్రముఖ గాయకుడు పెంచల్ దాస్ స్వీయ రచనలో రూపొందిన ఈ గీతం ‘శ్రీకారం’ చిత్రంలోనిది. సాహిత్యానికి తగ్గట్టు మిక్కీ జె.మేయర్ స్వరాలు సమకూర్చారు. ప్రోమోని తాజాగా విడుదల చేశారు. పూర్తి పాట నవంబరు 9న సాయంత్రం 5:40నిలకు సంగీత ప్రపంచలోకి రాబోతుంది. శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా వస్తోంది. కిశోర్ రెడ్డి దర్శకుడు. రైతుగా కనిపించనున్నాడు శర్వా. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకురాబోతుంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.