శ్రీ సింహా మత్తు వదిలించిన తారక్‌

శ్రీ సింహా ఎవరు? ఆయన మత్తు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎందుకు వదిలిస్తాడు అనుకుంటున్నారా? ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ నూతన నటీనటులతో ‘మత్తు వదలరా’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. రితేష్‌ రానా దర్శకుడు. ఈ చిత్రంతో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహా కథానాయకుడుగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను తారక్‌ విడుదల చేశాడు. ఈ పోస్టర్‌లో న్యూసెన్స్‌ అనే పత్రికపై పడుకుని ఉంటాడు కథానాయకుడు. తన టీ షర్ట్‌పై సినిమాకు సంబంధించిన వివరాలు రాశారు. ఈ పత్రికలో నూతన పరిచయం శ్రీ సింహా అని శీర్షికతో తారక్‌ ఫొటోను ఉంచారు. దీంతో అందరిలో ఆసక్తి మొదలైంది. ప్రముఖ గాయకుడు కాలభైరవ ఈ చిత్రంతో సంగీత దర్శకుడుగా మారుతున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.