ఆకుచాటు పిందె తడిసె.. కొమ్మచాటు పువ్వు తడిసె!


తెలుగువారి కీర్తిని, ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన నందమూరి తారక రామారావు జీవిత కథను ‘ఎన్టీఆర్‌’ పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘కథానాయకుడు’, ‘జన నాయకుడు’ పేర్లతో రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. ‘ఎన్టీఆర్‌’గా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకుడు. ఇందులో శ్రీదేవి పాత్రలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మెరవబోతోంది. ఈ వారం నుంచే రకుల్‌కి సంబంధించిన సన్నివేశాలు తెరకెక్కిస్తారని సమాచారం. ఎన్టీఆర్‌ - శ్రీదేవిలది విజయవంతమైన కాంబినేషన్‌. వీరిద్దరికీ చాలా హిట్స్‌ ఉన్నాయి. అందులో ‘అడవిరాముడు’ ఒకటి. ఈ చిత్రంలోని ‘ఆకు చాటు పిందె తడిసె’ పాట అప్పట్లో మాస్‌ని ఉర్రూతలూగించింది. ఇప్పుడు ఈ పాటని బాలకృష్ణ - రకుల్‌లపై తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ - శ్రీదేవి కలయికలో వచ్చిన మరి కొన్ని హిట్‌ గీతాల్ని ఈ బయోపిక్‌లో గుర్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని తొలి భాగాన్ని జనవరి 9న విడుదల చేస్తారు. రెండో భాగం జనవరి 24న వస్తుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.