వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా..
ప్రముఖ నటుడు సుబ్బరాజు ఓ సినిమా కోసం వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా మారాడు. అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు హేమంత్‌ మధుకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ చిత్రంలోనే సుబ్బరాజు.. వివేక్‌ అనే ఫొటోగ్రాఫర్‌ పాత్రలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించి ఆయన ఫస్ట్‌లుక్‌ విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో సుబ్బరాజు సీరియస్‌గా దర్శనమిచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న హాలీవుడ్‌ నటుడు మైఖేల్‌ మ్యాడిసన్‌, తమిళ నటుడు మాధవన్‌, కథానాయిక షాలినీ పాండే పోస్టర్లు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు సుబ్బరాజు చేరడంతో సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. వీళ్లతోపాటు అవసరాల శ్రీనివాస్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్‌, కోన వెంకట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.