ఒక్కరోజు తేడాతో రక్షకుడు, రాక్షసుడు వస్తున్నారు

అన్యాయం జరిగితే ఎదురించేందుకు ఎవరో ఒకరు వస్తారు. ఇది ఇప్పటి మాట కాదు.. ‘కృష్ణుడి గీతలో ఎప్పుడో చెప్పారు. రాక్షసుడు ఎదిగిననాడు ఒకడొస్తాడని, వాడే ఇప్పుడొస్తున్నాడు.. రక్షకుడు వస్తున్నాడు’ అంటూ అందరిలో ఆసక్తి రేపుతున్నాడు యువ కథానాయకుడు సుధీర్‌ బాబు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈయన కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘వి’. నాని ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికి వరకు తెరపై కనువిందు చేయని ఓ సరికొత్త కథతో వస్తున్నారు. ఇందులో నాని ప్రతినాయక ఛాయలున్న పాత్రలో దర్శనమివ్వనున్నాడని ముందునుంచే ప్రచారం సాగింది. ప్రస్తుతం సుధీర్‌ బాబు ట్వీట్‌ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. రాక్షసుడుగా నాని, రక్షకుడుగా సుధీర్‌ కనిపించనున్నారన్నమాట. తాజాగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ తన ఫస్ట్‌లుక్‌ గురించి ప్రకటించాడు. జనవరి 27న ‘వి’ చిత్రంలోని ఫస్ట్‌లుక్‌ వస్తుందని చెప్పుకొచ్చాడు. జనవరి 28న రాక్షసుడు(నాని) ఫస్ట్‌లుక్‌ రాబోతుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.