ప్రముఖ హిందీ నటుడు రాజకీయ నాయకుడు సన్నీ డియోల్కి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. విషయం తెలిసిన ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..నేను కరోనా పరీక్ష చేయించుకున్నాను. ఫలితం సానుకూలంగా వచ్చింది. ప్రస్తుతం నేను ఒంటరిగా ఉన్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. గత కొద్ది రోజులుగా నాతో సంప్రదించిన మీరందరూ, దయచేసి మిమ్మల్ని మీరు వేరుచేసి, పరీక్ష చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను అంటూ వెల్లడించారు. ప్రస్తుతం సన్నీ డియోల్ ముంబైలో భుజానికి శస్త్ర చికిత్స చేయించుకొని కులు జిల్లా మనాలి సమీపంలోని తన వ్యవసాయక్షేత్రంలో ఉంటున్నారు. ప్రస్తుతం సన్నీ అప్నే2గా వస్తున్న సీక్వెల్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఆయన లోకసభ ఎంపీగా కొనసాగుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ 23, 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో గురుదాస్పూర్ నుంచి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జఖర్పై గెలుపొందారు.