నవదీప్‌ని మెచ్చుకున్న సన్నీ లియోని

నవదీప్‌ తెలుగులో చాలా సినిమాల్లో సహాయ నటుడిగా, హీరోగా నటించారు. ‘గౌతమ్‌ ఎస్‌.ఎస్‌.సి’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నవదీప్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ నటి సన్నీ లియోనితో కలిసి ఓ వెబ్‌సీరీస్‌లో నటిస్తున్నారు. సన్నీలియోని నటించిన ‘రాగిణి ఎంఎంఎస్‌’ వెబ్‌ సీరీస్‌ రెండో సీజన్లో శృంగార తార సన్నీతో కలిసి ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే నవదీప్‌ తెలుగులోనూ కొన్ని వెబ్‌ సీరీస్‌లోనూ నటించిన సంగతి తెలిసిందే. ఈ విధంగానైనా బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నందకు నవదీప్‌కి మంచి అవకాశమే దొరికినట్టైయింది. ఈ ప్రాజెక్టు గురించి సన్నీ లియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో నవదీప్‌తో కలిసి దిగిన ఫోటో పెట్టి ఆ ఫోటోకు..‘‘ఓ మంచి వ్యక్తితో కలిసి పనిచేస్తున్నా’’ అని సర్టిఫికెట్‌ ఇచ్చేసింది. మొత్తం మీద టాలీవుడ్‌ సెక్సీబాయ్‌ బాలీవుడ్‌ హాట్‌బాంబ్‌లు ఇలా వెబ్‌ సీరీస్‌లో దర్శనమివ్వనున్నారన్న మాట. నవదీప్‌ ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

View this post on Instagram

Working on set with @pnavdeep So nice to work with such a nice person!

A post shared by Sunny Leone (@sunnyleone) onCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.