కరోనా దెబ్బ: సుశాంత్‌ వాహనం ఆగింది

సుశాంత్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. నో పార్కింగ్‌.. ఉపశీర్షిక. నూతన దర్శకుడు దర్శన్‌ తెరకెక్కిస్తున్నారు. రవిశాస్త్రి, హరీష్‌ కోయలగుండ్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న థ్రిల్లర్‌ చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కాగా.. కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణను నిలిపివేస్తున్నట్లు సుశాంత్‌ ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ‘‘తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మా సినిమా చిత్రీకరణను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం. ప్రపంచమంతా కరోనాను నివారించేందుకు పోరాడుతోంది. మరీ అత్యవసరమనుకుంటే తప్ప సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా అన్ని జాగ్రత్తలు తీసుకోండి’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు సుశాంత్‌.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.