రియా చక్రవర్తిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్‌ మృతిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ని రియా చక్రవర్తితో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసింది. ఇందులో రియా చక్రవర్తి సోదరుడు షోయిక్‌ చక్రవర్తి, ఆమె తండ్రి ఇంద్రజిత్‌ చక్రవర్తి, రియా సహచరి సంధ్య చక్రవర్తి, సుశాంత్‌ హౌస్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరండా, శ్రుతి మోదీపై ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు ఉన్నాయి. వీరిపై నేరపూరిత కుట్ర, ఆత్మహత్య పురికొల్పడం, దొంగతనం, మోసం, బెదిరింపుల వంటి ఆరోణలు ఉన్నాయి. బీహార్‌ రాష్ర్టప్రభుత్వ సిఫారసు ప్రకారం కేసును సీబీఐకి బదిలీ చేశారు. గతంలో ఈ కేసును సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్‌ ముఖ్యమంత్రి నితీష్‌ని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ఈ కేసు కోసం సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. బృందానికి గుజరాజ్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ శశిధర్‌ నాయకత్వం వహిస్తుండగా, డిఐజీ గగన్‌దీప్‌ గంభీర్‌ దర్యప్తును పర్యవేక్షిస్తారు. ఇంకా ఈ కేసులో మనీలాండరింగ్‌ కోణాన్ని సైతం ఈడీ (ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరక్టరేట్‌) పరిశీలిస్తుంది. అంతేకాదు నటుడు సుశాంత్‌ సింగ్‌ ఖాతా నుంచి 15కోట్లు ఏమయ్యాయి అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు ఇదే నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని ఈడీ రియాను ఆదేశించింది. అయితే ఆమె సుప్రీంలో తన పిటిషన్ విచారణకు వచ్చేంత వరకు తన స్టేట్‌మెంట్‌ని రికార్డు చేయవద్దని ఈడీని రియా కోరిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆమె ఆమె విన్నపాన్ని సైతం ఈడీ అధికారులు తిరస్కరించారు. దాంతో రియా ఈరోజు 11.30 గంటలకు విచారణకు హాజరు కావాలని మరోసారి సమన్లు జారీ చేయడంతో, విధిలేని పరిస్థితుల్లో ముంబైలోని ఈడీ కార్యాలయానికి రియా హాజరైంది. త్వరలో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.

View this post on Instagram
A post shared by Viral Bhayani (@viralbhayani) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.