సుస్మితాసేన్‌ రోహ్మాన్‌ షాల్‌ రొమాన్స్

అందాల సుందరి సుస్మితాసేన్‌ తన ప్రియుడు రోహ్మాన్‌ షాల్‌తో కలిసి సందడి చేస్తుంది. తాజాగా సుస్మితా సేన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా రోహ్మాన్‌తో కలిసి జిమ్‌ చేసిన వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో..‘‘మా ఇద్దరి మధ్య బంధం రెండు భాగాలు కాదు..ఒకదానికొకటి శక్తినిచ్చే రెండు సంపూర్ణజీవితాలు. ఇది మా నిజమైన ప్రేమకు నిర్వచనం..’’ అంటూ పేర్కొంది. సుస్మితా సేన్‌ తన కంటే చాలా చిన్నవాడైనా అతని మనసు చాలా పెద్దది అంటూ గతంలోనూ సర్టిఫికెట్ ఇచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా ముఖ్యంగా చాలా రకాలైన ఫిట్‌నెస్‌ సూత్రాలను తన సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది సుస్మితాసేన్‌. ఇటీవల ఆమె అడిసన్‌ వ్యాధితో ఎన్నాళ్లు పొరాడింది. ఆ మొండి వ్యాధిని మానసికంగా, ఎలా జయించింది లాంటి విషయాలను కూడా వీడియో ద్వారా చెప్పింది.

View this post on Instagram

A post shared by Sushmita Sen (@sushmitasen47) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.