కోవిడ్‌-19 బీమాను ఆశ్రయించిన తాప్సి ‘లూప్‌ లాపెటా


ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారి కరోనా వైరస్‌ (కోవిడ్‌-19). దీని కారణంగా హాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రసీమతో దక్షిణాది చిత్రాలు సైతం ఎక్కడికక్కడ ఆగిపోయాయి. తాప్సి నటిస్తున్న చిత్రం ‘లూప్‌ లాపెటా’. ఆకాష్‌ భాటియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కోవిడ్‌ -19 బీమా పొందడానికి చిత్ర నిర్మాతలు తమ న్యాయ సలహాదారులతో చర్చలు జరుపుతున్నారని వార్తలొస్తున్నాయి. తాప్సి, తాహిర్‌ రాజ్‌ భాసిన్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమా సిబ్బందికి కోవిడ్‌-19 బీమాను చేయించాలని అనుకుంటున్నారు. ఇలా చూస్తే తొలిసారిగా కోవిడ్‌-19 బీమా చేసిన చిత్రంగా ‘లూప్‌ లాపెటా’ను చెప్పుకోవచ్చు. ఈ విషయం గురించి చిత్రనిర్మాతలు అతుల్‌ కాస్బెకర్‌, తనూజ్ గార్గ్ స్పందిస్తూ..‘‘ప్రస్తుతానికి మేం న్యాయ నిపుణులతో చర్చలు చేస్తున్నాం. అన్ని బీమాల్లాగే కోవిడ్‌-19 కూడా ఉంటుంది. సిబ్బందికి కరోనావైరస్ వచ్చినా, నిర్మాతలు ఏదైనా నష్టం వచ్చినా అన్నింటిని ఈ బీమా చేయిండం ద్వారా ఆ నష్టాన్ని భర్తి చేసుకోవచ్చునని..’’ చెబుతున్నారు. అయితే కచ్చితంగా బీమా నిబంధనలకు అనుగుణంగానే షూటింగ్‌ జరుపుకోవాల్సి ఉంటుంది. సినిమా షూటింగ్‌ వర్షకాలం పూర్తైయిన తరువాతే షూటింగ్‌ ప్రారంభించనున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్‌ జరుపుకోలేదు. సినిమాకి సంబంధించి ఇప్పటికే ముంబై, గోవాలో కొంత చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది దీపావళి పండుగ తరువాతనే సినిమా సెట్స్ పైకి వెళ్లాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.