టీ స్పెషలిస్ట్‌ తాప్సీని చూశారా!

కథానాయిక తాప్సీ టీ స్పెషలిస్ట్‌గా మారిందా? అనే సందేహంలో ఉన్నారా? వ్యక్తగతంగా కాదులేండి. వృత్తిపరంగా మంచి టీ సిద్ధం చేసింది. అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో ‘తప్పడ్‌’ అనే చిత్రంలో నటిస్తుంది తాప్సీ. ఇందులో అమృత అనే గృహిణి పాత్ర పోషించింది. ఈ నెల 28 ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ట్విటర్‌ వేదికగా ఓ ఫొటోను పంచుకుంది. గులాబి రంగు దుస్తుల్లో దర్శనమిచ్చింది తాప్సి. ఫ్లాస్క్, గ్లాస్, పంచదార గిన్నె ఉన్న ఓ ట్రే పట్టుకుని గృహిణిగా ఒదిగిపోయింది. ఒక్క పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దీంతోపాటు ‘తప్పడ్‌’ రెండో ట్రైలర్‌ను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసి సినిమాపై ఆసక్తి పెంచుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌-1 అంచనాలు పెంచుతుంది. భార్యాభర్తల అనుబంధాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.


                           


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.