మీసాలతో హంగామా చేస్తున్న తమన్నా

మిల్కీబ్యూటీ తమన్నా తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ‘కాళిదాసు చిత్రంతో కలవరపెట్టింది. ‘కొంచెం ఇష్ట కొంచెం కష్టం’తో ‘100% లవ్‌’తో ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటూ హంగామా చేస్తున్న తమన్నా ఆమ ధ్య పిల్లోఛాలెంజ్‌ అంటూ సవాలు విసిరింది. తాజాగా తమన్నా అభిమాని ఓ విచిత్రమైన వీడియోను షేర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగవైరలవుతోంది. తమన్నా అందమైన మూతిపై నల్లని మీసాలను సవరిస్తూ, కనుబొమ్మలను అటు ఇటూ తిప్పుతూ కన్నెపిల్లలకు కన్నుకొడుతున్నట్లుంది. ప్రస్తుతం గోపీచంద్‌తో కలిసి ‘సీటీమార్‌’ చిత్రంలో కబడ్డికోచ్‌గా నటిస్తోంది. మరోవైపు హిందీలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ సరసన ‘బోలే చుడియాన్‌’లో మీనాగా అలరించనుంది.

View this post on Instagram

A post shared by ????????? ?????? (@tamannaah__bhatia) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.