ప్రియుడితో సరదాగా మాల్దీవుల్లో తాప్సి సందడి!

మొగుడు, ఝుమ్మంది నాదం లాంటి తెలుగులో సందడి చేసిన అందాల భామ తాప్సి. బాలీవుడ్‌లో సాండ్‌ కీ అంఖ్‌ తప్పాడ్‌లో నటించి ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ భామ తన ప్రియుడితో కలిసి మాల్దీవుల్లో కలిసి సరదగా విహరిస్తున్న ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. తాప్సి ప్రియుడు మాథియాస్‌ బో తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సముద్రపుతీరాన తాప్సితో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఓ ఫోటోను షేర్‌ చేశారు. ఈ హాలీడే మాకు నచ్చింది. ఇక్కడ మేం ఉన్నందుకు తాజ్‌మాల్దీవు్‌కి ధన్యవాదాలు. అంటూ పేర్కొన్నారు. తాప్సి కూడా తన బృందం కలిసి స్కూబాడైవింగ్‌ చేసిన వీడియోని సైతం ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. గతంలో ఓ మీడియాతో మాట్లాడుతూ..నేను ఏదీ దాచడానికి ఇష్టపడను. నా జీవితంలో మరొకరి ఉనికిని అంగీకరం అంటే నాకు చాలా గర్వంగా ఉంది. అయితే ముఖ్యమైన అంశాల గురించి మాత్రమే మాట్లాడతాను. నేను నా తల్లితండ్రుల దగ్గర ఎలాంటి దాపరికాలు ఉంచుకోను. నాకు నేనుగా నా జీవితాన్ని ఇష్టపడినట్టుగానే ఉంటాను. అలాగని వేరొకరిని ఇబ్బందిపెట్టే ఆలోచనలేదు అని తెలిపింది. తాప్సి తన ప్రేమగురించి, వివాహం గురించి కూడా ఆ మధ్య మనసువిప్పి మాట్లాడింది. నేను సినిమా వ్యక్తిని ప్రేమించలేదు. లేదా ఏ క్రికెటర్‌నో, వ్యాపారవేత్తతోనో డేటింగ్‌ చేయను. నా పెళ్లి ఎప్పుడు అనేది చెప్పలేను. కానీ అది వ్యాపారవేత్త, లేక పెద్దడబ్బున్న వ్యక్తా, లేక ఇంకే రంగానికి చెందిన మనిషి చెప్పలేం. వివాహ సమయంలో మీకే అన్ని విషయాలు తెలుస్తాయి అంటూ సమాధానమిచ్చింది. తాప్సి ప్రస్తుతం ‘రష్మి రాకెట్’‌ అనే చిత్రంలో నటిస్తోంది. ఆకర్ష్‌ ఖుర్రానా దర్శకత్వంలో కీడ్రా నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని రోనీ స్కూవాలా, నేహా ఆనంద్‌, ప్రంజల్‌ నిర్మిస్తున్నారు. చిత్రంలో ప్రియాన్షు పెన్యూలీ నటిస్తోంది. గుజరాతికి చెందిన రష్మి అనే అమ్మాయి ఫాస్ట్ రన్నర్‌గా పేరుతెచ్చుకుంటోంది. ఆ అమ్మాయిని గ్రామంలోని ప్రజలంతా ‘రాకెట్’ అని పిలుస్తుంటారు. ఈ చిత్రంలో తాప్సి పాత్ర గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతానికి చెందిన అమ్మాయిగా నటిస్తోంది. ఆమె తన జీవితంలో ఎదురైన అడ్డంకులను అధిగమించి ఎలా బయటపడిందనేది కథ. ప్రస్తుతం తాప్సీ పన్నూ క్రైమ్‌ థిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘హసీన్‌ దిల్‌రుబా’ చిత్రంలో విక్రాంత్‌ మాస్సేతో నటిస్తోంది. త్వరలోనే విడుదల కానుంది. మరోపక్క భారతీయ మహిళ క్రికెటర్‌ మిథాలి రాజ్‌ జీవితాధారంగా తెరకెక్కుతోన్న ‘శెభాష్‌ మిథు’ అనే చిత్రంలో నటిస్తోంది. తాహిర్‌ బాసిన్‌తో కలిసి ‘లూప్‌ లాపెటా’ చిత్రంలోనూ సందడి చేయనుంది.

View this post on Instagram

A post shared by Mathias Boe (@mathias.boe) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.