టైటిల్‌ మార్చేది లేదు.. ఎవడు ఆపుతాడో చూస్తా?

‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి హిట్‌ తర్వాత దర్శకుడు తేజ నుంచి వస్తోన్న మరో క్రేజీ చిత్రం ‘సీత’. కాజల్‌ - బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మే 24న థియేటర్లలోకి అడుగుపెట్టబోతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ ఓ వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. చిత్ర విడుదలను ఆపివేయాలంటూ వారు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై మీడియా ద్వారా తేజ క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితిల్లోనూ టైటిల్‌ను మార్చేది లేదని తేల్చి చెప్పారు. దీనిపై ఆయన వివరణ ఇస్తూ.. ‘‘నేనెందుకు మార్చాలి టైటిల్‌? ‘సీత’ కాకపోతే శూర్పణఖ అని పెట్టాలా? నేను అస్సలు మార్చను. ‘సీత’ సినిమా ఇలాగే ఉంటది. సెన్సార్‌ బోర్డు కూడా సర్టిఫికెట్‌ ఇచ్చేసింది. కాబట్టి ఎవ్వరికీ నేను సినిమా చూపించాల్సిన అవసరం లేదు. కచ్చితంగా రేపు చిత్రాన్ని విడుదల చేస్తాను. ఎవడు ఆపుతాడో చూసుకుంటా?’’ అని గట్టిగా బదులిచ్చారు తేజ. 




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.