మరో మ్యూజికల్‌ సర్‌ప్రైజ్‌

‘అల వైకుంఠపురములో’.. 2020 బ్లాక్‌ బ్లస్టర్‌ చిత్రంగా నిలిచిన ఈ చిత్రంలోని ప్రతి పాట శ్రోతల్ని అలరించింది. ఈ సినిమాకి బలం తమన్‌ సంగీతం అనడంలో అతిశయోక్తి కాదేమో. అంతలా తన మ్యూజిక్‌ మ్యాజిక్‌తో ఆకట్టుకున్నాడు. నేపథ్య సంగీతమూ అదే స్థాయిలో అందించి హత్తుకున్నాడు. తాజాగా మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాడు తమన్‌. అల వైకుంఠపురములో.. బ్యాగ్రౌండ్‌ ఒరిజినల్‌ సౌండ్‌ ట్రాక్‌తోపాటు మరికొన్ని ట్రాక్స్‌ వినిపించనున్నాడు. సినిమాలో వినిపించినవి కాకుండా సరికొత్తగా విడుదల చేసే సంగీతం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సంగీత అభిమానులు. త్వరలోనే విడుదల కానున్నాయి. అల్లు అర్జున్‌ కథానాయకుడుగా త్రివిక్రమ్‌ తెరకెక్కించిన చిత్రమే ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే నాయిక.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.