నవరసాలు పండిస్తున్న జాన్వీ కపూర్‌!

అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ యుద్ధఫైలట్‌గా నటిస్తున్న చిత్రం ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్’. శరణ్‌ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదల కానుంది. తాజాగా ఈ భామ వివిధ రకాల మనోభావాలను తన ముఖాభినయం ద్వారా తెలియజేసింది. ఈ నవరసాల ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఆ ఫోటోకు డిజిటల్‌ ప్రచారంలో అనేక హావభావాలు అంటూ ట్యాగ్‌లైన్‌ తగలించింది. 1999 కార్గిల్ యుద్ధంలో యుద్ధభూమిలో ప్రవేశించిన భారత వైమానిక దళ పోరాట యోధురాలు పైలట్ గుంజన్ సక్సేనా జీవితం నుండి ప్రేరణ పొందిందిన సినిమాకి శరణ్ శర్మ దర్శకత్వంగా పంకజ్ త్రిపాఠి, అంగద్ బేడి, వినీత్ కుమార్, మానవ్ విజ్, అయేషా రాజాలు నటించారు. ఈ చిత్రాన్ని మొదట మార్చి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఈ సినిమా నిర్మాణానంతర పనులు ఆలస్యం కావడంతో ఏప్రిల్‌ 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడిన సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకొస్తుంది.

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.