కరోనాకి కనికరం ఉండదు


క్షిణాది సినీ నటి త్రిష సినిమాల్లోనే కాదు సామాజిక సేవలోనూ ముందుంటుంది. తాజాగా ఆమె కరోనా వైరస్‌ గురించి ట్విట్టర్లో స్పందిస్తూ...‘‘ఈ మహమ్మారి కరోనా వైరస్‌కి ప్రాంతం, భాష, వయసు, దేశంలాంటి ప్రాంతీయ బేధాలు ఏమీ ఉండవు. అందరిని సమానంగా చూసుకుంటుంది. అందుకే మనం మాత్రం దానికి దూరంగా ఉంటూ, మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకోసం ప్రతి ఒక్కరు తమ ఇళ్లలోనే కొన్నాళ్ల పాటు ఉండాల్సిందే. ఇంట్లోనుంచి బయటకు రాకుండా ఉండడం ఇబ్బందే. అయినా తప్పదు. అందరూ కలిసి కట్టుగా మహమ్మారిపై పోరాటం చేయాలి’’ అని పేర్కొంది. తెలుగులో చిరంజీవి సరసన ‘ఆచార్య’లో కథానాయికగా నటించే అవకాశం దక్కించుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల ‘ఆచార్య’ నుంచి విరమించుకున్నట్లు తెలిపింది. అంతే కాదు మరొక మంచి వైవిధ్యమైన చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తాని కూడా చెప్పింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.