‘యునైట్‌ 2 ఫైట్‌ కరోనా’ అంటోన్న వెంకీ!

ప్రపంచమంతా కరోనా వైరస్‌తో (కోవిడ్‌-19) ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కరోనా వైరస్‌ భారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక్కటే మార్గం మాస్క్ ధరించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం ఇవే మనకు రక్ష. తెలుగు నటుడు వెంకటేష్‌ తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మూడు సూత్రాలను పాటించాలంటూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘ముందుగా మాస్క్ ధరించడం, చేతులను శ్రుభంగా కడుక్కోవడం, సామాదూరాన్ని పాటించడంతో భారతదేశాన్ని సురక్షితంగా ఉంచగలరు. రెండు చేతులతో నమస్కారం చేస్తూ.. కోవిడ్‌-19కి వ్యతిరేకంగా ప్రజలంతా ప్రధాని మోదీతో కలిసి జల్‌అండోదలన్‌, యునైట్‌ 2 ఫైట్‌ కరోనా పోరాటం చేస్తూ  సహకరించాలని ఆయన ట్విట్టర్లో’’ వెల్లడించారు. వెంకటేష్‌ ప్రస్తుతం ‘నారప్ప’ చిత్రం చేస్తున్నారు. తమిళనాడులో కొందరు అణగారిన వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కి, భారీ విజయం సొంతం చేసుకున్న చిత్రం ‘అసురన్‌’. దానికి రీమేక్‌ తెలుగులో ‘నారప్ప’. శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కిస్తున్నారు. ప్రియమణి కథానాయికగా నటిస్తోంది. ఒక భూస్వామి పేదల భూములు ఆక్రమించాలని చూస్తే దానికి వ్యతిరేకంగా ఎలా పోరాడారన్నదే ఈ చిత్ర కథాంశం.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.