ఉపేంద్ర ‘కబ్జ’ థీమ్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన వర్మ

‘రా ఓం వంటి చిత్రాలతో ఆకట్టుకున్న నటుడు ఉపేంద్ర. ప్రస్తుతం ఆర్‌ చంద్రు దర్శకత్వంలో కబ్జ అనే చిత్రాన్ని చేస్తున్నారు. లగడపాటి శ్రీధర్‌ సమర్పకుడిగా శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై సినిమా నిర్మితమౌతోంది. మాఫియా నేపథ్యంలో కబ్జ చిత్రం తెరకెక్కుతోంది. ఈరోజు ఉప్రేంద్ర పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ థీమ్‌ ఫోస్టర్ని విడుదల చేశారు. పోస్టర్లో ఉపేంద్ర నోట్లో సిగరెట్ పెట్టుకొని ఉన్న స్టైయిల్‌గా ఉన్నారు. అతని వెనకాల 1947 అని రాసి ఉంది. కందనే బుల్లెట్‌పై శవంతో వెళ్తుండగా, చుట్టుపక్కల శవాలగుట్టలు కనిపిస్తున్నాయి. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న సినిమాని తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, మరాఠీ, హందీలోనూ తెరపైకి రానుంది. చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జాకీ ష్రాఫ్‌, కోట శ్రీనివాసరావు, నయనతార‌ నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీత స్వరాలు సమకూరుస్తుండగా, అర్జున్ శెట్టి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.