ఉద్వేగభరితంగా ‘ఉప్పెన’ ఫస్ట్‌లుక్‌

సా
యి ధరమ్‌ తేజ్‌ సోదరుడు ‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వైష్ణవ్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో సముద్ర తీరంలో దర్శనమిస్తాడు వైష్ణవ్‌. అనుకున్నది జరిగినపుడు వచ్చే ఆనందం, పతనమెదురైనపుడు కలిగే బాధ ఎలా ఉంటుందో.. ఈ పోస్టర్‌లో వైష్ణవ్‌ని చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఉప్పెనలా ఎగసెగసి పడుతున్న అలల నడుమ చేతులు చాపి గట్టిగా అరుస్తూ కనిపిస్తున్నాడు. ఇంతకీ ఆయన ఇలా మారడానికి, సంద్రానికి సంబంధం ఏమిటి? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ముఖం కనిపించకుండా హావభావంతోనే ఆసక్తి రేపుతుంది ఈ పోస్టర్‌. మైత్రీ మ´వీ మేకర్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ సహకారం అందిస్తున్నారు. కృతి శెట్టి కథానాయిక. 2020 ఏప్రిల్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.