‘ఉప్పెన’ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్న మహేష్‌

‘ఉప్పెన’ చిత్రానికి సంబంధించి ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు ప్రముఖ హీరో మహేష్‌ బాబు. వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి జంటగా బుచ్చిబాబు తెరకెక్కించిన ప్రేమ కథే ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. ఇందులోని ‘నీ కన్ను నీలి సముద్రం’, ‘ధక్‌ ధక్‌ ధక్‌’ పాటలు విడుదలై విశేష ఆదరణ పొందాయి. మరో పాటను సంగీత ప్రపంచంలోకి తీసుకురాబోతున్నారు మహేష్‌. శ్రీమణి రచించిన ‘రంగులద్దుకున్న’ గీతాన్ని నవంబరు 11న సాయంత్రం 4:05నిలకు మహేష్‌ విడుదల చేయనున్నారు. మంచి ప్రేమ రాగమని తెలుస్తోంది. మరి ఈ సాంగ్‌ ఎలా అలరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ రచన సహకారం అందించిన ఈ చిత్రం వేసవిలోనే విడుదల కావాల్సి ఉన్నా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఎప్పుడు విడుదల చేస్తారో ఇంకా స్పష్టత ఇవ్వలేదు చిత్రబృందం.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.