హీరో విక్రమ్‌కు లీగల్‌ నోటీసులు?

తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని నమోదు చేసిన సినిమా ‘అర్జున్‌ రెడ్డి’. బాల దర్శకత్వంలో తమిళంలో ‘వర్మ’గా రూపొందింది. హీరో విక్రమ్‌ కుమారుడు ధృవ విక్రమ్‌ కథానాయకుడు. చిత్రీకరణ సంతృప్తికరంగా లేకపోవడంతో నిర్మాతలు మరోసారి ఈ చిత్రాన్ని పునఃనిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో దర్శకుడు బాల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారు. తాజాగా ఈ సినిమాను ‘ఆదిత్య వర్మ’ టైటిల్‌తో రూపొందించారు. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. గతంలో ఈ సినిమాకు దర్శకత్వం వహించిన బాల ఇటీవల హీరో విక్రమ్‌కు లీగల్‌ నోటీసులు పంపారని సమాచారం. గతంలో తాను చిత్రీకరించిన సన్నివేశాలను ఈ సినిమాలో ఉపయోగించరాదని లీగల్‌ నోటీస్‌ సారాంశం. ‘ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్‌’ పతాకంపై రూపొందిన ఈ చిత్రం జూలైలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.