వరుణ్‌ ట్వీట్‌కు నితిన్‌ కామెంట్‌ కారణం అదేనా?

వరుణ్‌ తేజ్‌తో హరీష్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ‘వాల్మీకి’. ఈ చిత్రంలో నితిన్‌ కూడా నటిస్తున్నాడని సమాచారం. ఈ ‘వాల్మీకి’ కథలో భాగంగా మరో సినిమా రన్‌ అవుతుందట. అందులో హీరోగా నితిన్‌ పోషిస్తున్నాడని ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. తాజాగా నితిన్‌ పెట్టిన కామెంట్‌తో నిజమేనేమో అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అందుకే ఈ కామెంట్‌ పెట్టాడని సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇంతకీ ఏంటంటే.. ఈ చిత్రం సెప్టెంబరు 20న విడుదలవుతున్న సందర్భంగా కథానాయకుడు వరుణ్‌ తేజ్‌ తన ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంటూ.. ‘నేను వస్తున్నా! సెప్టెంబరు 20న! అనే వ్యాఖ్యను జోడించాడు. దానికి సమాధానంగా నితిన్‌ ‘నేను చూస్తున్నా సెప్టెంబరు 20న’ అంటూ రీ ట్వీట్‌ చేసి కామెంట్‌ పెట్టాడు. దీంతో నితిన్‌ ఈ సినిమాలో నటిస్తున్నాడంటూ అభిమానులు చర్చ ప్రారంభించారు. అయితే ఈ విషయంపై నెటిజన్లు అడిగిన దానికి నితిన్‌ స్పందించలేదు. ఈ సస్పెన్స్‌ వీడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.