మనల్ని మనమే కాపాడుకుందాం అంటోన్న నారప్ప

ప్రముఖ తెలుగు నటుడు విక్టరీ వెంకటేష్‌ కరోనా నేపథ్యంలో ఓ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్‌చేశాడు. ‘‘మనందరికీ మన దేశానికి సేవ చేసే అవకాశం వచ్చింది. ఈ దేశానికి మనమేమి చేయలేనమనుకోవద్దు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలి. అందరూ ఒకరికొకరు సామాజిక దూరం పాటిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరు ఇంట్లోనుంచి బయటకు వెళ్లకుండా ఉండాలి. ఈ కరోనా మహమ్మారి మన దేశాన్ని మనమే రక్షించుకుందాం’’అంటూ పేర్కోన్నాడు. తెలుగు చిత్రసీమ నుంచి ఇప్పటికే పలువురు తమవంతు సాకారంగా విరాళాలతో పాటు సందేశాల్ని కూడా సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.