వెన్నెల అవార్డు.. వేణుమాధవ్‌కు అంకితం

ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్‌ అకాల మరణం తెలుగు చిత్రసీమతో పాటు యావత్‌ సినీప్రియులను శోక సంద్రంలో ముంచేసింది. ఆయన మన నుంచి దూరమై వారం కావొస్తున్న ఆయన లేరన్న వార్తను ఇంకా ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిషోర్‌, నవ్వుల రేడుకు తనదైన శైలిలో ఘన నివాళి అర్పించారు. తాజాగా జరిగిన 17వ సంతోషం సౌతిండియా అవార్డ్సులో వెన్నెల కిషోర్‌కు పద్మశ్రీ అవార్డు గ్రహీత అల్లు రామలింగయ్య స్మారక పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా తనకీ అవార్డు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూనే.. దీన్ని ఇటీవల కన్నుమూసిన సీనియర్‌ కమెడియన్‌ వేణు మాధవ్‌కు అంకితమిస్తున్నట్లు ప్రకటించి ఆయనకు ఘనమైన నివాళి అర్పించారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.