ఇక్కడ లేనందుకు బాధగా ఉంది

ప్రస్తుతం హైదరాబాద్‌లో లేనందుకు విచారంగా ఉందని తెలిపాడు యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నటించే సినిమా చిత్రీకరణ కోసం ఆయన విదేశానికి వెళ్లారు. భౌతికంగా అక్కడ ఉన్నా మనసంతా ఇక్కడే ఉందని పేర్కొన్నారు. వర్షం కారణంగా హైదరబాద్‌ మహానగరం వణిపోతున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాలు అస్తవ్యస్థంగా మారాయి. ఈ నేపథ్యంలో విజయ్‌ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ ప్రేమతో హైదరాబాద్‌ని ఉద్దేశిస్తూ.. హైదరాబాద్‌కి దూరంగా ఉన్నందుకు బాధగా ఉంది. మీ గురించే  ఆలోచిస్తున్నాను. అందరూ బావుండాలని ప్రార్థిస్తున్నాను. అమ్మఒడి లాంటి సొంత నగరాన్ని తిరిగి చేరుకునేందుకు వేచి చూస్తున్నాన’ని ట్వీట్‌ చేశాడు విజయ్‌. ‘మేము నిన్ను చాలా మిస్‌ అవుతున్నాం విజయ్‌, నువ్వు జాగ్రత్తగా ఉండు, త్వరగా వచ్చేయ్‌’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.