ఫాలోయింగ్‌లో దూసుకెళ్తోన్న విజయ్‌

కథానాయకుడు విజయ్‌ దేవరకొండకు యూత్‌లో ఎంత ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో స్టార్‌డమ్‌ దక్కించుకుని బాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న దక్షిణాది నటుడిగా రికార్డు సృష్టిస్తున్నాడు. విజయ్‌ ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య 9 మిలియన్‌. ఏ కథానాయకుడికి ఇంతమంది ఫాలోవర్స్‌ లేరని చెప్పొచ్చు. మహేష్‌ బాబు, ప్రభాస్‌ వంటి అగ్ర కథానాయకుల్ని దాటి ఇంతటి ప్రజాదరణ పొందడం విశేషం. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఫైటర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రంలో నటిస్తున్నాడు విజయ్‌. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందే ఈ సినిమాలోని పాత్ర కోసం శిక్షణ తీసుకుని తన రూపుని మార్చేశాడు. అనన్య పాండే నాయిక. ఈ సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకులకి పరిచయం కాబోతున్నాడు. మరోవైపు శివ నిర్వాణ, మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి, సుకుమార్‌ దర్శకత్వంలో నటించనున్నాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.