‘బిజిల్‌’ చిత్ర బృందానికి విజయ్‌ సర్‌ప్రైజ్‌
తమిళ నటుడు విజయ్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘బిజిల్‌’. యువ దర్శకుడు అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రంలో భాగస్వాములైన సభ్యులను విజయ్‌ తాజాగా సర్‌ప్రైజ్‌ చేశాడు. ఈ సినిమా కోసం పలు విభాగాల్లో పనిచేసిన 400 మందికి బంగారు ఉంగరాలు బహుమతిగా అందించాడు. వాటిపై సినిమా టైటిల్‌ ‘బిజిల్‌’ను ఆంగ్ల అక్షరాల్లో ముద్రించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన అర్చన కలపతి సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసి దీపావళికి విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్స్‌ చూస్తే విజయ్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు అనిపిస్తుంది. బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.