చిత్రసీమలో మహిళల ప్రాధాన్యతను పెంచారామె
‘విజయ నిర్మల మరణ వార్త తనని తీవ్రంగా కలచి వేసిందని’’ ఆవేదన వ్యక్తం చేశారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రముఖ నటిగా, దర్శకురాలిగా భారతీయ చిత్రసీమలో తనదైన ముద్రవేశారు విజయ నిర్మల. తాజాగా ఆమె అనారోగ్యంతో మృతి చెందడం పట్ల యావత్‌ సినీ, రాజకీయ రంగాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.


‘‘బాల నటిగా తెలుగు సినిమా రంగంలో ప్రవేశించి, పరిశ్రమించి పట్టుదలతో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు సహా ఎన్నో పురస్కారాలను పొందారు. అత్యధిక సినిమాలు తెరకెక్కించిన మహిళా దర్శకురాలిగా తెలుగు సినిమా రంగంలో మహిళల ప్రాధాన్యతను పెంచిన ఘనత శ్రీమతి విజయనిర్మల గారికి దక్కుతుంది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’’


- భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
‘‘అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌ బుక్ రికార్డు సాధించిన మేటి దర్శకురాలైన విజయనిర్మల మరణం చిత్రపరిశ్రమకు తీవ్ర లోటు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’

- ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంతి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి 
‘‘సీనియర్ నటి విజయనిర్మల మరణం దిగ్భ్రాంతికరం. నటిగానే కాక దర్శకురాలిగా అనేక కుటుంబ కథాచిత్రాలను అందించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ,వారి అభిమానులకు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’


- తెదేపా అధినేత చంద్రబాబునాయుడు
విజయనిర్మల మృతి పట్ల తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణంతో చిత్ర పరిశ్రమ ప్రముఖ దర్శకురాలు, నటిని కోల్పోయిందన్నారు. విజయనిర్మల మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

‘‘మ‌న తెలుగు ప‌రిశ్ర‌మ‌లో భానుమ‌తిగారి త‌ర్వాత గ‌ర్వించ‌ద‌గిన బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి విజ‌య‌నిర్మ‌ల గారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా.. దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారు. అంత‌టి ప్రతిభావంతురాలిని మ‌నం ఇప్ప‌ట్లో ఇంకెవ‌రినీ చూడ‌లేం. కృష్ణ‌గారికి జీవిత భాగ‌స్వామినిగా ఎప్పుడూ ఆయ‌న ప‌క్క‌న నిల‌బ‌డి ఆయ‌న‌కు చేదోడు వాదోడుగా ఉంటూ త‌న ధ‌ర్మాన్ని నెర‌వేరుస్తూ వ‌చ్చారు. ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావ‌త్ తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కృష్ణగారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నా’’


- చిరంజీవి
‘‘న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న విజ‌య‌నిర్మ‌ల‌ గారు క‌న్నుమూయ‌డం ఎంతో బాధాక‌రం. సినీ రంగ పరిశ్ర‌మ‌లో మ‌హిళా సాధికార‌త‌ను చాటిన అతి కొద్ది మంది మ‌హిళ‌ల్లో విజ‌య‌నిర్మ‌ల‌గారు ఒక‌రు. నాన్న‌గారి ‘పాండురంగ మ‌హ‌త్మ్యం’లో కృష్ణుడిగా న‌టించారు. అదే ఆవిడ న‌టించిన తొలి తెలుగు సినిమా. బాలన‌టి నుంచి హీరోయిన్‌గా కూడా ఎన్నో గొప్ప చిత్రాల్లో న‌టించారు. నాన్న‌గారితో ‘మారిన మ‌నిషి’, ‘పెత్తందార్లు’, ‘నిండు దంప‌తులు’, ‘విచిత్ర‌ కుటుంబం’ సినిమాల్లో న‌టించారు. అలాగే ద‌ర్శ‌కురాలిగా 44 చిత్రాల‌ను డైరెక్ట్ చేయ‌డం చాలా గొప్ప విష‌యం. ద‌ర్శ‌కురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి ఎంతో మంది మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. ఆమె మృతి చిత్ర‌సీమ‌కు తీర‌నిలోటు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆ భ‌గ‌వంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’


- నంద‌మూరి బాల‌కృష్ణ‌
‘‘మా ఆత్మీయురాలు శ్రీమతి విజయ నిర్మల ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’


-కృష్ణంరాజు
‘‘విజయ నిర్మల మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. కృష్ణ, నరేశ్‌కు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. చిత్ర పరిశ్రమలో ఆమె ముద్ర చెరగనిది’’


- పవన్‌ కల్యాణ్
‘‘విజయ నిర్మల జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె ఇక లేరన్న వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా’’


- జూ.ఎన్టీఆర్‌

సుధీర్‌బాబు: మా కుటుంబానికి బాధాకరమైన రోజు. ఓ లెజెండ్‌, అంతకుమించి నా తల్లిలాంటి వ్యక్తిని కోల్పోయాం. ఆమె దేవుడి సన్నిధికి చేరిపోయారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. పురుషాధిక్యం ఉన్న ఈ చిత్ర పరిశ్రమలో ఆమె మహిళలకు ఒక దారి చూపించారు. మహిళా సాధికారతకు ఆమెకు చిహ్నంలా మిగిలిపోతారు.

రాశీ ఖన్నా: విజయ నిర్మల హఠాన్మరణం షాక్‌కు గురిచేసింది. చిత్ర పరిశ్రమలో స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ఎంచుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

అల్లరి నరేశ్: చిత్ర పరిశ్రమకు విజయ నిర్మల మూలస్తంభం లాంటివారు. నటిగా, దర్శకురాలిగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆమె మరణం తీరని లోటు. కృష్ణ, నరేశ్‌ కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.

నితిన్‌: విజయ నిర్మల అప్పుడే వెళ్లిపోవడం బాధాకరం. తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.

ఈషా రెబ్బా: తెలుగు చిత్ర పరిశ్రమకు ఐరన్‌ లేడీ లాంటివారైన విజయనిర్మల ఇక లేరని తెలిసి షాకయ్యాను. గొప్ప నటి, దర్శకురాలు, గిన్నీస్‌ బుక్‌ రికార్డు సాధించిన మహిళ. తెలుగు చిత్ర పరిశ్రమకు మీరు అందించిన సేవలు మరువలేనివి.

మంచు మనోజ్‌: మీరు ఇండస్ట్రీకి వచ్చి చరిత్ర సృష్టించారు. మీరు సాధించినంతగా మున్ముందు తరాల వారూ సాధించలేరేమో. ఇప్పుడు మీరు వెళ్లిపోయారు. మిమ్మల్ని మిస్సవుతాం నానీ (అమ్మమ్మ). మీ సినిమాలు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.

శ్రీను వైట్ల: ఎంతటి బాధాకరమైన విషయం. విజయ నిర్మల ఇక లేరు. మిమ్మల్ని చాలా మిస్సవుతాం మేడమ్‌. మా పట్ల మీరు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేం.

కాజల్‌: విజయ నిర్మల హఠాన్మరణం చెందారని తెలిసి షాకయ్యాను. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

రానా: విజయ నిర్మల అందించిన సినిమా కథల రూపంలో ఆమె చిరకాలం నిలిచిపోతారు.

మంచు లక్ష్మి: చిత్ర పరిశ్రమలోని ఎన్నో కీలక అంశాలకు విజయ నిర్మల మద్దతు తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. జీవితాన్ని సంతృప్తికరంగా గడిపారు.

కల్యాణ్‌రామ్‌: తెలుగు చిత్ర పరిశ్రమకు విజయ నిర్మల మరణం తీరని లోటు.

సమంత: తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళా టెక్నీషియన్లకు ఓ దారి చూపిన లెజెండ్ విజయ నిర్మల చనిపోవడం చాలా బాధాకరం. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా ఆమె ఎందరికో స్ఫూర్తిదాయకం.

సుశాంత్‌: మీ అద్భుతమైన పనితీరు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది విజయ నిర్మల గారూ..

నాని: విజయ నిర్మల ఆత్మకు శాంతి కలగాలి. ఆమె కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను.

బ్రహ్మాజీ: మిస్‌యూ ‘మీనా’ (విజయ నిర్మల, కృష్ణ నటించిన చిత్రం).నటించిన చిత్రం).

విజయ నిర్మలకు సినీ ప్రముఖ నివాళి
చిత్రమాలిక కోసం క్లిక్‌ చేయండి

సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.