వావ్‌!! అనిపిస్తున్న విజయశాంతి యాక్షన్‌ వీడియో

దమూడు ఏళ్ల తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో టాలీవుడ్‌ రీ ఎంట్రీ ఇచ్చారు నటి విజయశాంతి. ప్రొఫెసర్‌ భారతి పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. మహేష్‌ బాబు కథానాయకుడుగా దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ ఆనందాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటుంది చిత్ర బృందం. తాజాగా అనిల్‌ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ.. విజయ శాంతి ఫైట్‌ చేస్తున్న ఓ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ‘13 ఏళ్ల తర్వాత అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చారు. మాస్టర్‌ కిక్‌. భోగి శుభాకాంక్షలు’ అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘లేడీ అమితాబ్, లేడీ సూపర్‌ స్టార్, వావ్‌’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు నెటిజన్లు.
సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.