యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘విక్రమ్‌ 58’

విక్రమ్‌ కథానాయకుడిగా రాబోతున్న తమిళ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా ‘విక్రమ్‌ 58’. అజయ్‌ జ్ఞాన ముత్తు దర్శకత్వంలో రూపొందుతోంది. సెవన్‌ స్క్రీన్, వయాకాం 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర పోస్టర్‌ను ట్విట్టర్‌ వేదికగా విడుదల చేశారు. పోస్టర్‌లో విక్రమ్‌ ముఖం రెండు రకాలుగా కనిపిస్తూ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ఆగష్టులో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది. 2020 వేసవి నాటికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలో చిత్రబృందం వెల్లడించనుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.