‘విరాటపర్వం’లో సాయి పల్లవి ఏం చేస్తుంది!

సాయి పల్లవి అనగానే మనకు గుర్తొచ్చే సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలోని ఆమె నటించిన పాత్రలు మన కళ్లెదుటే కనిపిస్తుంటాయి. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి ప్రస్తుతం ‘విరాట పర్వం’లో కథానాయికగా నటిస్తోంది. ఈరోజు సాయి పల్లవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘విరాటపర్వం’ చిత్రబృందం పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తూ, సాయిపల్లవితో కూడిన ప్రత్యేక పోస్టర్ని విడుదల చేశారు. పోస్టర్లో సాయి పల్లవి అమరవీరుల స్థూపం దగ్గర కూర్చుని, చేతిలో కలం పట్టుకుని దేనికోసమో ఎదురుచూస్తున్నట్లుంది. అంతే కాదు ఆ పక్కనే సంచి కూడా ఉంది. ఆ స్తూపంపై ‘అమరవీరులకు జోహార్లు’ అంటూ రాశారు. సురేష్‌బాబు సమర్పణలో వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో రానా ప్రధాన పాత్రలోగా నటిస్తుండగా, సాయి చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 1990ల నాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి బెల్లి లలిత అనే పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. జాతీయ నటి నందితా దాస్‌ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.