ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చాడు!!

వరుణ్‌ తేజ్‌ కథానాయకుడుగా కిరణ్‌ కొర్రపాటి ఓ చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ‘వరుణ్‌ తేజ్‌ 10’ వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాకి ‘బాక్సర్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. బాక్సింగ్‌ నేపథ్యంలో యాక్షన్‌ డ్రామాగా రూపొందుతుంది. ఈ కథలో ప్రతినాయక పాత్ర కీలకమైందని, ఇందుకు కన్నడ స్టార్‌ ఉపేంద్రను తీసుకుంటున్నారని గతంలో వార్తలొచ్చాయి. చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన రావకపోవడంతో ఊహాగానాలుగానే మిగిలాయి. తాజాగా ఈ విషయంలో స్పష్టత ఇచ్చాడు వరుణ్‌. శుక్రవారం (నేడు) ఉపేంద్ర జన్మదినం సందర్భంగా.. శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘త్వరలోనే మీతో షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని తెలిపాడు. బాక్సర్‌గా కనిపించేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు వరుణ్‌. ఈ సినిమాకు తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. నాయిక వివరాలు ఇంకా వెల్లడికాలేదు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.